ఆమె నా ఇన్‌స్పిరేషన్: త్రిప్తి దిమ్రీ.. 

07 March 2025

Prudvi Battula 

రణబీర్ యానిమల్ సినిమాతో అతిధి పాత్రలో మెరిసి సెన్సేషన్‌ క్రియేట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ.

ఈ సినిమాలోని ఈమె మెయిన్ హీరోయిన్ కాకపోయినా రష్మిక కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకోవడంతో ఈమెపై అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం కెరీర్‌లో మంచి ఫామ్‌లో ఉన్న ఈ అమ్మడు తనకు ఓ బాలీవుడ్‌ హీరోయిన్ ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు.

ఫిలిం ఇండస్ట్రీలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా నే తన ఇన్‌స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు హీరోయిన్ త్రిప్తి దిమ్రీ.

బాలీవుడ్‌లో కెరీర్‌ ప్రారంభించి గ్లోబల్ హీరోయిన్‌గా ప్రూవ్ చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు.. అన్నారు త్రిప్తి.

అలాంటి అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసిన ఏకైక హీరోయిన్ ప్రియాంక చోప్రా ఒక్కరే అని చెప్పుకొచ్చింది ఈ భామ.

బర్ఫీ సినిమా మొదటి సారి చూసినప్పుడు ప్రియాంక చోప్రాను గుర్తు పట్టలేకపోయాను.. సినిమా కోసం ఆమె ఎంత కష్టపడిందో..

క్యారెక్టర్‌ కొసం ఆమె అంతలా మారిపోవటం ఆశ్చర్యంగా అనిపించింది అంటూ ప్రియాంక చోప్రాను కొనియాడారు త్రిప్తి.