ఏఎన్ఆర్‎తో స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలు వీరే..

06 March 2025

Prudvi Battula 

Credit: Instagram

ఏఎన్ఆర్.. తెలుగు చలనచిత్రంపై చెరగని చిరునామా. 255 చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు.

20 సెప్టెంబర్ 1923లో గుంటూరు జిల్లా రామాపురం జన్మించారు నాగేశ్వర్రావు. గత ఏడాదికి అయన ఈ నేలను పావనం చేసి శత వసంతాలు పూర్తయ్యాయి.

ఈ మేరకు ఆయనను ఓ సారి గుర్తు చేసుకొంటూ అయనతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న హీరోలు ఎవరో తెలుసుకుందాం.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరు ఇండస్ట్రీకి రెండు కళ్ళు. తెలుగు చిత్రానికి గౌరవాన్ని తెచ్చిపెట్టిన మహానటులు. 14 సినిమాల్లో వీరిద్దరూ కలిసి నటించారు.

ఏఎన్ఆర్ తనయుడు నాగార్జునతో కూడా కొన్ని చిత్రాల్లో నటించారు. వీరిద్దరూ కలిసి 8 చిత్రాల్లో కనిపించి మెప్పించారు.

సూపర్ కృష్ణతో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు ఏఎన్ఆర్. వీరిద్దరి కాంబినేషన్ లో మొత్తం 4 చిత్రాలు వచ్చాయి.

బాలయ్య రాముడిగా కనిపించిన శ్రీరామరాజ్యం చిత్రంలో వాల్మీకి పాత్రలో కనిపించి మెప్పించారు నాగేశ్వర్రావు.

తన మనవడు నాగ చైతన్యతో మనం చిత్రంలో కొట్లాడుతూ ఆకట్టుకున్నారు. ఇది ఆయన నటించిన చివరి చిత్రం.