సైరాలో చిరు చెప్పిన ఈ డైలాగ్స్ వింటే పూనకాలే.. 

04 May 2025

Prudvi Battula 

స్వేచ్చా కోసం ప్రజలు చేస్తున్న తిరిగుబాటు... నా భరతమాత గడ్డమీద నిలబడి హెచ్చరిస్తున్న.. నాదేశం వదిలి వెళ్ళిపోండి... లేదా యుద్దమే.

ఇందుకు కట్టాలరా నీకు శిస్తు. కురిసే వాన ఆడగదు, తడిసే నేల ఆడగదు, పండే పంట ఆడగదు. నువ్వెవడవని అడుగుతున్నాను. శిస్తు!

నారు మళ్ళ నుంచి నూరు పిల్ల దాకా. చేను మాది, చెట్టు మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోత మాది, కుప్ప మాది. నీకెందుకు కట్టాలిరా శిస్తు!

తల ఎత్తండి. కళ్ళు తుడుచుకొని, రొమ్ము విరుచుకొని, సగర్వంగా చూడండి. మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ గడ్డ మీద తలలు జోలపాటలోనే వీరగాధలున్నాయి.

ఈ దేశం చేసిన యుద్ధం పురాణమైంది. ఈ దేశం చిందించిన నెత్తురు ఇతిహాసం అయింది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం. ఇక విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం.

ఇక స్వేచ్ఛ నేర్పుదాం. భారతమాతను బానిసను చేసి వ్యాపారం చేస్తున్న ఈ ఇతర దొరల తలలు తెంచుతూ తరిమికొడదాం.

ఈ గడ్డం మీద పుట్టిన ప్రతి ప్రాణానికి లక్ష్యం ఒక్కటే స్వాతంత్రం స్వాతంత్రం స్వాతంత్రం. ఆ స్వాతంత్రం కోసం యోధుడు వదిలిన ప్రాణం యుద్ధంలా పుడుతుంది.

ఇకపై నేను యుద్ధాన్ని,స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశమోతుంది. ఇకపై నేను దేశాన్ని, ఈ ఉరికొయ్యకు వేలాడుతున్న నన్ను చూసి ఉత్సవాలు చేయండి. సంబరాలు చేరండి.