ఈ ముద్దుగుమ్మ అందాలు చాలా హాట్ గురూ.. పిచ్చెక్కిస్తున్న హరితేజ పిక్స్

Phani CH

08 March 2025

Credit: Instagram

యాంకర్, బిగ్‌బాస్ బ్యూటీ,  నటి హరితేజ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఈ చిన్నది కెరీర్ మొదట్లో టీవీ సీరియల్స్‌లో కీలక పాత్రల్లో నటించింది.

తన నటనతో బుల్లితెర ప్రేక్షకుల్ని మంచి ఆకట్టుకుంది.. తన అద్భుతమైన నటనకు జనాలు ఫిదా అయిపోయారనడంలో అతిశయోక్తిలేదు.

చిన్నారి, రక్త సంబంధం, కన్యాదానం, మనసు మమత, అభిషేకం ఇలా ఎన్నో సీరియల్స్‌లో నటించింది ముద్దుగుమ్మ హరి తేజ.

ఆ తరువాత పలు షో ల్లో యాంకర్ గా అవకాశాలు దక్కించుకుని  అక్కడ కూడా ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసిందనే చెప్పాలి.

టీవీలోనే కాకుండా అటు వెండితెరపై కూడా తన నటనతో ఆకట్టుకుంది హరితేజ. ఆడవారి మాటలకి అర్థాలే వేరులే,  అఆ, అత్తారింటికి దారేది, 1 నేనొక్కడినే ఇలా ఎన్నో సినిమాల్లో కూడా నటించింది.

తనకున్న క్రేజ్ తో బిగ్‌బాస్ తెలుగు సీజన్-1లో అడుగు పెట్టి తన పెర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. మొత్తానికి టైటిల్ కొట్టకపోయినా థర్డ్ ప్లేస్‌తో గౌరవంగా ఆ సీజన్ నుంచి బయటికొచ్చింది. 

ఇది ఇలా ఉంటే గతేడాది దేవర, బచ్చలమల్లి సినిమాల్లో కనిపించింది. ఇక ఈ ఏడాది గేమ్ ఛేంజర్ సినిమాలో సందడి చేసింది. ప్రస్తుతం హరి చేతిలో పలు సినిమాలు, వెబ్ సిరీస్ ఉన్నాయి.