రామ్ చరణ్ తన కూతురికిచ్చే అతి పెద్ద గిఫ్ట్ ఏదో తెలుసా?

09 January 2025

samatha

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చిరుత సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ హీరో, మగధీర సినిమాతో స్టార్ స్టేటస్ అందుకున్నారు.

 ప్రస్తుతం ఈ హీరో గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దీంతో ఈ మూవీ ప్రమోషన్స్‌లో చాలా బిజీ అయిపోయారు చెర్రీ.

చరణ్ ఇటీవల బాలయ్య హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్4లో అతిథిగా పాల్గొని తన అభిమానులతో చాలా విషయాలు పంచుకున్నారు.

ముఖ్యంగా తన గారాల పట్టీ క్లింకార గురించి , ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.  ఇప్పుడిప్పుడే తాను ఉపాసనను అమ్మ అని పిలుస్తందని చెప్తూ చాలా సంతోషించారు.

 ఇక క్లింకారను ఎందుకు ఇప్పటి వరకూ మీ అభిమానులకు చూపించలేదు,  తనను మాకు ఎప్పుడు చూపిస్తావు అని బాలయ్య అడగగా చరణ్ మాట్లాడుతూ

 క్లింకార నన్ను నాన్న అని ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే తనను ఈ ప్రపంచానికి పరిచయం చేస్తాను అంటూ చెప్పుకొచ్చారు.

అలాగే ఆయన మాట్లాడుతూ.. నేను చిన్న వయసులో ఎక్కువ ఎంజాయ్ చేయలేకపోయాను, ప్రతి ఒక్కరూ నన్ను గుర్తుపట్టడం వలన నాకు ప్రైవసీ ఉండకపోయేది.

నా కూతురు నాలా ఇబ్బంది పడకూడదు, తాను అందరిలా, ఎంజాయ్ చేయాలి. అందుకే నా కూతురికి నేను ఇచ్చే పెద్ద గిప్ట్ ప్రైవసీ అంటూ చెర్రీ తెలిపారు.