ఆ నిర్మాణ సంస్థల్లో దర్శకులు లాక్.. ఏళ్లుగా సినిమాలు..
Prudvi Battula
05 February 2025
తెలుగు ఇండస్ట్రీలో కొందరు దర్శకులకు ఆ నిర్మాణ సంస్థలు కేరాఫ్ అడ్రస్‌లగా మారిపోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఒక్క నిర్మాతతో వరసగా సినిమాలు చేస్తున్నారు.
త్రివిక్రమ్‌నే తీసుకోండి.. ఈయన సినిమా అనౌన్స్ చేసారంటే చాలు వెనక హారిక హాసిని క్రియేషన్స్ అని ఉండాల్సిందే.
2012లో వచ్చిన జులాయి నుంచి ఇప్పుడు చేస్తున్న అల్లు అర్జున్ సినిమా వరకు గురూజీ సినిమాలన్నీ ఈ నిర్మాణ సంస్థలోనే. బయటి నిర్మాతలకు అందుబాటులోనే లేరు.
అనిల్ రావిపూడి పూర్తిగా దిల్ రాజుకు ఇంటి మనిషి అయిపోయారు. అనిల్ చేసిన 8 సినిమాల్లో 6 సినిమాలు దిల్ రాజు బ్యానర్‌లోనే చేసారు.
ఇక శేఖర్ కమ్ముల లవ్ స్టోరీతో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLPలోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ధనుష్ కుబేరా అక్కడే తెరకెక్కిస్తున్నారు. మరో సినిమాను ఇదే సంస్థలో ప్రకటించారు.
తండేల్ తర్వాత మరోసారి గీతా ఆర్ట్స్‌లోనే సినిమా చేయబోతున్నారు చందూ మొండేటి. తండేల్ ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వస్తుంది.
రంగస్థలం నుంచి మైత్రి మూవీ మేకర్స్‌లోనే ఉండిపోయారు సుకుమార్. పుష్పతో మైత్రికి మెమొరబుల్ సినిమా ఇచ్చారు.. నెక్ట్స్ చరణ్ సినిమా కూడా ఇదే బ్యానర్‌లో చేస్తున్నారు.
సందీప్ రెడ్డి వంగా సైతం టీ సిరీస్ భూషణ్ కుమార్‌తోనే కబీర్ సింగ్, యానిమల్ చేసారు. నెక్ట్స్ అనౌన్స్ చేసిన స్పిరిట్‌తో పాటు బన్నీ సినిమాలు కూడా ఇదే బ్యానర్‌లో ఉన్నాయి.