షాలిని పాండే సైలెంట్ అయ్యిపోయిందేంటబ్బా..! 

18 January 2025

Rajeev 

 ఫస్ట్ మూవీతోనే ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ అందుకున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ఒక్క సినిమా చేసి ఊహించని రేంజ్‏లో ఫాలోయింగ్ సంపాదించుకుంటారు.

షాలిని సెన్సెషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన అర్జున్ రెడ్డి మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. 

ఇందులో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతోనే విజయ్ కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయ్యింది

కానీ షాలిని మాత్రం ఇప్పటికీ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అర్జున్ రెడ్డి తర్వాత ఈ బ్యూటీకి తెలుగులో ఆఫర్స్ వస్తాయనుకున్నారు అంతా..

కానీ అలా జరగలేదు. ఒకటి రెండు చిత్రాల్లో నటించి ఆ తర్వాత పరిశ్రమకు దూరమయ్యింది.

చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది షాలిని. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్.

ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్, జిమ్ వర్కవుట్ వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది.