25లక్షలతో తీస్తే 8కోట్లు వసూలు చిరంజీవి మూవీ

Phani CH

12 Jul 2025

Credit: Instagram

మెగాస్టార్‌ చిరంజీవి ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి మెగాస్టార్‌గా ఎదిగారు అన్న సంగతి అందరికి తెలిసిందే.

తనదైన డాన్సులతో అందరిని ఆకట్టుకున్నారు. అయితే ఆ సమయంలో  అనేక అవమానాలు ఆటుపోట్లు ఎదుర్కొన్నారట చిరు.

అయితే చిరంజీవి తనని తాను నిరూపించుకోవడానికి దాదాపు ఐదేళ్లపాటు ఆయన స్ట్రగుల్‌ అయ్యారు. హీరోగా, విలన్‌గా, గెస్ట్ రోల్స్, క్యారెక్టర్స్ చేసుకుంటూ వచ్చారు.

ఎన్ని సినిమాలు చేసిన కొన్ని విజయాలు సాధిస్తున్నాయి కానీ స్టార్ డమ్ అయితే రావడం లేదు.. ఇంకా ఏదో కావాలి. దాని కోసం వెతుకుతున్నాడు చిరు. 

అలాంటి టైమ్‌లో వచ్చిన సినిమానే `ఖైదీ`. చిరంజీవి కెరీర్‌ని `ఖైదీ`కి ముందు `ఖైదీ` తర్వాత పిలుస్తుంటారు. అంతటి విజయాన్ని ఈ మూవీ సాధించింది.

ఖైదీ సినిమా హాలీవుడ్‌ మూవీ `ఫస్ట్ బ్లడ్‌` తెలుగు రీమేక్‌ అని చెప్పొచ్చు. ఆ కథ నుంచి ఇన్‌స్పైర్‌ అయి ఈ మూవీని రూపొందించారు. 1983లో అక్టోబర్‌ 28న ఈ చిత్రం విడుదలైంది.

ఈ సినిమా 25లక్షల బడ్జెట్‌తో తీయగా.. రూ.8కోట్లు వసూలు చేసి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దెబ్బకి చిరంజీవి స్టార్‌ హీరో అయిపోయారు.