అందాల ముద్దుగుమ్మ రియా చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. కెరీర్ మొదట్లో తన అందం, నటనతో అందరినీ ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.
తూనీగా తూనీగా సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. ఈ సినిమా అంతగా హిట్ అవ్వకపోయినప్పటికీ ముద్దుగుమ్మకు మాత్రం విపరీతమైన క్రేజ్ లభించిందనే చెప్పాలి.
దీంతో ఈ అమ్మడు వరసగా ఆఫర్స్ అందుకుంటూ దూసుకెళ్తుందని చాలా మంది అనుకున్నారు. కానీ ఊహిచని విధంగా ఈ బ్యూటీ లైఫ్ టర్న్ అయ్యిందనే చెప్పాలి.
తూనీగా తూనీగా మూవీ తర్వాత బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది ఈ బ్యూటీ, అక్కడ పలు సినిమాలకు సైన్ చేసింది, అంతే కాకుండా వరస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
ఇక కెరీ పీక్స్ స్టేజ్‌లో ఉంది అనుకునేలోపే ఈ బ్యూటీ లైఫ్ టర్న్ అయిపోయింది. ఈ అమ్మడు బాలీవుడ్ క్రేజీ హీరోను ప్రేమించింది. అయితే అతను ఆత్మహత్య చేసుకోవడంతో ఈ బ్యూటీ చిక్కుల్లో పడింది.
ఆ కేసులో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ, ఐదేళ్లుగా ఈ కేసులో నిందితురాలిగా కొనసాగుతూ వచ్చింది. అలాగే డ్రగ్స్ కేసులో కూడా ఈ అమ్మడు జైలుకు వెళ్లి వచ్చింది.
ఇలా చాలా రోజులు సమస్యలు ఎదుర్కొన్న ఈ ముద్దుగుమ్మ ఇటీవల కోర్టు ఈ బ్యూటీని నిర్దోషిగా తేల్చింది. దీంతో ఈ అమ్మడు మళ్లీ తన కెరీర్‌ను స్టార్ట్ చేసింది.
ఈ బ్యూటీ తన అంద చందాలతో అందరినీ ఆకట్టుకుంటుంది. చీరలో తన గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెటిజన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.