అనుష్క ఐకానిక్ రోల్స్ ఇవే..
04 May 2025
Prudvi Battula
అనుష్క శెట్టి ఐకానిక్ పాత్రల్లో ఎప్పుడు టాప్లో ఉండేది అరుంధతి పాత్ర. ఈ పాత్రతో స్వీటీ లైఫ్ టర్న్ అయింది.
తర్వాత పంచాక్షరి అనుష్క టైటిల్ పాత్రలో ప్రేక్షకులను ఫిదా చేసింది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్న ఈమెకు మంచి మార్కులు పడ్డాయి.
వెంకటేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నాగవల్లి సినిమాలో చంద్రముఖిగా అక్కటుకుంది లేడీ సూపర్ స్టార్ అనుష్క.
తర్వాత బాహుబలిలో దేవసేన రోల్ అస్సలు ఎప్పటికి మర్చిపోలేరు. కుంతల రాజ్య యువరాణిగా తన నటనతో ఆకట్టుకుంది.
గుణశేఖర్ రూపొందించిన హిస్టారికల్ చిత్రం రుద్రమదేవి సినిమాలో రుద్రమదేవి పాత్ర తన కోసమే ఉందేమో అనేలా ఆకట్టుకుంది.
తర్వాత ఓం నమో వెంకటేశాయ సినిమాలో తిరుమల శ్రీవారి మహా భక్తురాలు కృష్ణమ్మ పాత్రకి ప్రాణం పోసింది స్వీటీ.
తర్వాత భాగమతి సినిమాలో కలెక్టర్ చంచలగా, భాగమతిగా నట విశ్వరూపం చూపించింది లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి.
చిరంజీవి సైరా నరసింహ రెడ్డి సినిమాలో వీరనారి ఝాన్సీ రాణి లక్ష్మీబాయిగా అతిధి పాత్రలో మెప్పించింది స్వీటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
శ్రీముఖి తన నటనతో మెప్పించిన చిత్రాలు ఇవే..
హ్యారీ పాటర్ మూవీ సిరీస్ చిత్రాలు ఎన్ని..? అవేంటి.?
డార్లింగ్ లైనప్ తెలిస్తే పూనకాలే.. చేతిలో డజన్పైనే మూవీస్..