అందుకే బోల్డ్ గా నటించా.. అసలు విషయం చెప్పిన అనుపమ 

15 october 2025

Rajeev Rayala

Images: Instagram

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మల్లో అనుపమ పరమేశ్వరన్ క్రేజే వేరు. 

ఈ చిన్నది తక్కువ సమయంలోనే విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. 

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాలో నటించింది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ.

ఆతర్వాత ఈ బ్యూటీ క్రేజ్ పెరిగిపోయింది. సోలో హీరోయిన్ గా నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్ గా నిలిచాయి. 

యంగ్ హీరోలందరి సరసన నటించిన ఈ వయ్యారి తెలుగులో స్టార్ హీరోయిన్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. 

సిద్దూ జొన్నలగడ్డ టిల్లు స్క్వేర్ సినిమాలో బోల్డ్ గా కనిపించి మెప్పించింది. దీనిపై మాట్లాడుతూ.. అనుపమ ఆసక్తికర కామెంట్స్. 

మీకు బిర్యానీ  అంటే ఇష్టమా..? కానీ ప్రతి రోజు బిర్యానీ తినలేము కదా..? బోర్ వచ్చేస్తుంది. అలాగే నాకు కూడా రొటీన్ పాత్రలు చేసి బోర్ వచ్చింది. అందుకే ఇలా ట్రై చేశా.. అని తెలిపింది అనుపమ