చీరలో యాంకర్ అందాల హోయలు.. క్యూట్ అంటున్న ఫ్యాన్స్!

samatha 

08 February 2025

Credit: Instagram

బిగ్ బాస్ ఫేమ్, తెలుగు యాంకర్ స్రవంతి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ఈమె ఏపీలో పుట్టి పెరిగి మోడలింగ్ లోకి అడుగుపెట్టి యాంకర్‌గా తన సత్తా చాటుతోంది.

పలు టీవీ ఛానెల్స్‌లో హోస్టుగా చేసింది, అలాగే స్టార్ హీరోలను ఇంటర్వ్యూలు చేసి మంచి ఫేమ్ సంపాదించింది. చివరకు జబర్దస్త్‌లో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ.

ఇక జబర్దస్త్‌లో వచ్చిన ఫేమ్‌తో ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

అయితే తాజాగా ఈ అమ్మడు చీరకట్టులో తన వయ్యారాలతో కుర్రకారును మాయ చేసింది. చీరలో చూడ ముచ్చటగా కనిపిస్తుంది.

న్యాచురల్ లుక్‌లో కనిపించి వావ్ అనిపించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఇందులో యాంకర్ స్రవంతి యాష్ కలర్ శారీలో కనిపించింది. సింపుల్ లుక్‌లో చేతిలో కప్ పట్టుకొని చూడడానికి చాలా అందంగా ఉంది.

ప్రస్తుతం ఈ ఫోటోస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. దీంతో... స్రవంతి చాలా  క్యూట్‌గా ఉన్నావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్