అలాంటి వాడు దొరికితే పెళ్లాడతా: అనన్య.. 

07 March 2025

Prudvi Battula 

Credit: Instagram

అనన్య నాగళ్ళ.. చేసిన సినిమాలు తక్కువే కానీ ఈ చిన్నదానికి యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

మల్లేశం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకుంది ఈ చిన్నది.

ఆతర్వాత ఒకటి రెండు సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచుకోలేకపోయింది అనన్య నాగళ్ళ.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించింది.

వకీల్ సాబ్ సినిమా తర్వాత అనన్యకు అవకాశాలు పెరిగాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది ఈ వయ్యారి భామ.

గత ఏడాది అనన్య తంత్ర, డార్లింగ్, పొట్టేలు, శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అనే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.

గతంలో ఈ ముద్దుగుమ్మ పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో చెప్పుకొచ్చింది.

తనకు కాబోయేవాడు హాయ్ నాన్న సినిమాలో నానిలా ఉండాలట.. అలాంటి వాడు దొరికితే పెళ్లాడతా అంటుంది అనన్య నాగళ్ళ.