కుర్రాళ్ళ హృదయాలు దోచేస్తున్న లిటిల్ హార్ట్స్ బ్యూటీ..

21 october 2025

Rajeev Rayala

Images: Instagram

ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా లిటిల్ హార్ట్స్.

ఇందులో మౌళి, శివాని నాగారం ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాతో శివాని క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. 

కాత్యాయని పాత్రలో కథానాయికగా కనిపించిన శివాని నాగారం ఎవరా అని తెగ సెర్చ్ చేస్తున్నారు. 

నటిగానే కాకుండా సింగర్ కమ్ కూచిపూడి డ్యాన్సర్ కూడా. 1988లో హైదరాబాద్ లో జన్మించిన ఈ అమ్మడు కూచిపూడి కూడా నేర్చుకుంది.

విల్లా మేరీ కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. అంతర్గత అనే షార్ట్ ఫిల్మ్ తో నటిగా మారింది.

2020లో మిస్టర్ గర్ల్ ఫ్రెండ్ అనే వెబ్ సిరీస్ చేసింది. ఇన్ స్టాలో చూసి అంబాజీపేట మ్యారేజీ బ్యాండు చిత్రంలో ఛాన్స్ వచ్చిందని తెలిపింది.

తొలి సినిమా కంటే ముందు జాతిరత్నాలు లో న్యూస్ ప్రెజెంటర్ గా చిన్న పాత్రలో నటించింది.