18 June 2025

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు.. కానీ కలిసిరాని అదృష్టం. 

Rajeev 

Pic credit - Instagram

ప్రస్తుతం తెలుగులో చాలా వరకు తెలుగు హీరోయిన్స్ హవా కనిపిస్తుంది. ఇలా స్టార్ హీరోయిన్స్ గా దూసుకుపోతున్న భామల్లో రీతు వర్మ ఒకరు. 

ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన ఈ భామ ఇప్పుడు హీరోయిన్‌గా మారింది. 

తెలుగుతో పాటు తమిళ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తూ అక్కడి ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.

కెరీర్ బిగినింగ్ లో పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది రీతు వర్మ. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది. ఎన్టీఆర్ బాద్షా సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది.

2013లో ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. నా రాకుమారుడు, ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్లో హీరోయిన్ గా చేసి ఆకట్టుకుంది.

నిన్నిలా నిన్నిలా, టక్‌ జగదీష్‌, ఒకే ఒక జీవితం, కణం, ఆకాశం, మార్క్ ఆంటోని, శ్రీవిష్ణు స్వాగ్, మజాకా సినిమాలు చేసింది. 

ఇటీవలే ఓ వెబ్ సిరీస్ లో నటించింది. దేవిక అండ్ డానీ సిరీస్ చేసింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ తన ఫొటోలతో ఆకట్టుకుంటుంది.