హిట్స్ లేకున్నా.. తన గ్లామర్‌తో క్రేజ్ పెంచుకుంటున్న అందాల రాశి ఖన్నా .. 

Rajeev 

14 Jul 2025

Credit: Instagram

అందాల  భామ రాశి ఖన్నా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. హిట్లు, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది. 

బడా సినిమాలకోసం ఎదురుచూడకుండా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటుంది ఈ అందాల ముద్దుగుమ్మ. 

ఊహలు గుసగుసలాడే సినిమాతో పరిచయమైన ఈ అమ్మడు. తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సొంతం చేసుకుంది.

మీడియం రేంజ్ హీరోలందరి సరసన సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస అవకాశాలు అందుకుంది.

కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి పేక్షకులను మెప్పించింది. ఇటీవలే హిందీలోనూ సినిమాలు చేసింది. 

తెలుగు తమిళ్, హిందీ భాషల్లో రాశీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రాశీ ఖన్నా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

మొదట్లో ఐఏఎస్ ఆఫీసర్ కావాలనుకున్నానని, అయితే మోడలింగ్‌లో పై ఆసక్తి ఉండటంతో స్క్రీన్ ఇండస్ట్రీకి వచ్చానని చెప్పింది.

దీని తర్వాత తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో కథానాయికగా కనిపించింది. సోషల్ మీడియాలోనూ మెప్పిస్తుంది ఈ అమ్మడు.