కృతి పాప సైలెంట్ అయ్యిందే.. స్పీడ్ తగ్గించిన బేబమ్మ .. 

Rajeev 

05 May 2025

Credit: Instagram

కృతి చిన్న వయస్సు నుండే వాణిజ్య ప్రకటనల్లో నటించింది, ఐడియా, షాపర్స్ స్టాప్, పార్లే, లైఫ్‌బాయ్, బ్లూ స్టార్ వంటి యాడ్స్ చేసింది. 

2019లో హిందీ చిత్రం "సూపర్ 30"లో హృతిక్ రోషన్ సరసన విద్యార్థిగా చిన్న పాత్రలో కనిపించింది.

2021లో ఉప్పెన" ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన  బెబ్బమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.

"ఉప్పెన" బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూలు చేసి విజయవంతమైంది. కృతికి ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ ఫర్ బెస్ట్ ఫీమేల్ డెబ్యూ సౌత్ లభించింది.

శ్యామ్ సింగరాయ్ (2021)లో నానితో కలిసి నటించిన ఈ చిత్రంలో మోడ్రన్ యువతిగా నటించి మెప్పించింది.

బంగార్రాజు (2022)సినిమాలో నాగచైతన్య సరసన నటించి ఆకట్టుకుంది. ఈ చిత్రం కూడా విజయం సాధించింది.

ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇప్పుడు ఈ అమ్మడు సినిమాల స్పీడ్ తగ్గించింది.