మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన మహానటి.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేస్తున్న కీర్తి
18 october 2025
Rajeev Rayala
Images: Instagram
2013లో గీతాంజలి అనే సినిమాతో హీరోయిన్ గా మలయాళీ చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తిసురేష్.
ఫస్ట్ సినిమాతోనే ఉత్తమ మహిళా అరంగేట్రం కథానాయికగా సైమా అవార్డ్ అందుకుంది.
2015 నాటికి కీర్తి తెలుగు, తమిళం, మలయాళం భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ముఖ్యంగా తెలుగులో మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయింది.
ఈ సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ క్యూ కట్టాయి.
2019 నుంచి 2024 వరకు అనేక చిత్రాల్లో నటించి తనదైన ముద్ర వేసింది. తెలుగుతోపాటు హిందీలోకి తెరంగేట్రం చేసింది. కానీ హిందీలో ఆమెకు ఊహించినంత స్థాయిలో సక్సెస్ రాలేదు.
2024 డిసెంబర్ లో తన చిరకాల స్నేహితుడు ఆంటోని థాటిల్ ను వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది.
ప్రస్తుతం కీర్తి సురేష్.. విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తుంది.