బ్లాక్ అండ్ వైట్ లో అదరగొట్టిన అందాల భామ అంజలి.. 

Rajeev 

24 February 2025

Credit: Instagram

 మన తెలుగమ్మాయే అయినప్పటికీ ముందుగా తమిళ్ సినిమాతో పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అంజలి 

ఆతర్వాత తెలుగులో నటించి మంచి హిట్స్ అందుకుంది. నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది అంజలి. 

తమిళ్ లో వచ్చిన షాపింగ్ మాల్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. ఈ సినిమా తెలుగులో కూడా డబ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.

షాపింగ్ మాల్ సినిమాలో తన నటనతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది ఈ చిన్నది. ఆతర్వాత జర్నీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది అంజలి.

తెలుగులో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో అంజలి మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ అమ్మడుకి చెప్పుకోదగ్గ సినిమాలు రాలేదు.

అల్లు అర్జున్ నటించిన సరైనోడు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో మెప్పించింది. అటు తమిళ్ సినిమాల్లోనూ.. ఇటు తెలుగు సినిమాల్లోనూ నటిస్తుంది. 

రీసెంట్‌గా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక నెట్టింట ఈ అమ్మడు లేటెస్ట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి.