అందాలతో ఆకట్టుకుంటున్న ఆకాంక్ష సింగ్.. మెస్మరైజ్ చేస్తున్న పిక్స్

Phani CH

29 May 2025

Credit: Instagram

ఆకాంక్ష సింగ్ గురించి ప్రస్తుత కుర్రకారుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. 2017 లో మళ్లీ రావా అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ.

ఈ చిన్నది 1990 జులై 30న రాజస్థాన్‌లోని జైపూర్‌లో జన్మించింది. నా బోలె తుం నా కుచ్ కహ, గుల్మొహర్ గ్రంధ్, అనే టెలివిజన్ సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది.

“బద్రీనాథ్ రి దుల్హనియా” సినిమాతో సినీరంగప్రవేశం చేసింది. ఆకాంక్ష సింగ్ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో నటించింది.

కన్నడలో పైల్వాన్, హిందీ మూవీ రన్ వే 34 వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకుంది. రంగ్‌బాజ్: దర్ కీ రాజ్‌నీతి, మీట్ క్యూట్ వంటి వెబ్ సిరీస్‌లలో కూడా ఆమె కనిపించింది.

 ఆ తర్వాత 2018 లో వచ్చిన హీరో నాని, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన దేవదాస్ సినిమాలో నటించింది ఆకాంక్ష సింగ్.

తెలుగులో అంతగా గుర్తింపు రాకపోయిన బాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతూ సూపర్ క్రేజీ సంపాదించుకుంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది.