పోటా పోటీగా ముగ్గురు స్వర మాంత్రికులు.. మధ్యలో నాలుగోవాడు..
Prudvi Battula
05 February 2025
టాలీవుడ్‌లో మ్యూజిక్ డైరెక్టర్ అనే పేరు వినగానే అయితే తమన్.. లేదంటే దేవీ శ్రీ ప్రసాద్ గుర్తుకొస్తారు.
ఈ ఇద్దరి మధ్యే కొన్నేళ్లుగా పోటీ నడుస్తుంది. మధ్య మధ్యలో చాలా మంది వస్తుంటారు పోతుంటారు కానీ స్టాండర్డ్‌గా ఈ ఇద్దరి మధ్యే ఉంటుంది.
తాజాగా వీళ్ళకు అనిరుధ్ తోడయ్యారు. దేవరతో ఈయన రేంజ్ పెరిగింది.. మరోవైపు దేవీ, తమన్ కూడా అస్సలు తగ్గట్లేదు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. దాంతో పాటు నాని ప్యారడైజ్ సినిమాకు సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు.
అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల ప్లాన్ చేస్తున్న సినిమాకు కూడా ఈయనే సంగీత దర్శకుడు.
మరోవైపు తండేల్‌తో దేవీ.. ఓజి సహా చాలా సినిమాలతో తమన్ రేసులోనే ఉన్నారు. అనిరుధ్, దేవీ శ్రీ ప్రసాద్, తమన్.. ముగ్గురూ రీ రికార్డింగ్‌కు పెట్టింది పేరు.
ఎవరి మ్యాజిక్ వాళ్లు చూపిస్తున్నారు. ఈ ముగ్గురి మధ్యలో తాజాగా భీమ్స్ కూడా ఎంటరయ్యారు. సంక్రాంతికి వస్తున్నాంతో మనోడి రేంజ్ ఒక్కసారిగా పెరిగింది.
నెక్ట్స్ అనిల్ రావిపూడి, చిరు సినిమాకు కూడా భీమ్సే సంగీతం అందించే అవకాశం ఉంది. మొత్తానికి టాలీవుడ్‌లో మ్యూజికల్ చైర్ గేమ్ ఆసక్తికరంగా నడుస్తుందిప్పుడు.