13 July, 2025
Subhash
ప్రముఖ వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ట్రెండింగ్ పేజీని మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
ట్రెండింగ్ పేజీని 2015లో ప్రారంభించగా.. వైరల్ వీడియోలు, బ్రేకింగ్ న్యూస్, టాప్ మ్యూజిక్ రిలీజ్‌లను హైలైట్ చేసేందుకు అవకాశం ఉండేది.
దాదాపు దశాబ్దకాలం పాటు యూజర్లకు ట్రెండింగ్ కంటెంట్‌ను అందించిన ఈ ఫీచర్‌ను ఈ ఏడాది జులై 21 నుంచి వీడ్కోలు పలుకనుంది.
వినియోగదారుల వ్యూయింగ్ హ్యాబిట్స్‌లో వచ్చిన మార్పులతో పాటు ప్లాట్‌ఫామ్ అభివృద్ధికి అనుగుణంగా మూసివేయాలని నిర్ణయించినట్లు యూట్యూబ్ పేర్కొంది.
యూట్యూబ్ ట్రెండింగ్ పేజీ గతంలో యూజర్లకు ప్లాట్‌ఫామ్‌లో పాపులర్ కంటెంట్‌ను తెలుసుకునేందుకు ఓ మెయిన్ డెస్టినేషన్‌గా ఉంది.
ఈ పేజీలో వీడియోలు అన్ని వర్గాల నుంచి, ముఖ్యంగా హై క్లిక్ రేట్‌తో ఉన్నవి కనిపించేవి. గత కొంతకాలంగా యూజర్ల అలవాట్లు మారుతూ వస్తున్నాయి.
యూట్యూబ్ అధునాతన రికమెండేషన్ అల్గారిథమ్‌లు హోమ్‌పేజీల ద్వారా ట్రెండింగ్ కంటెంట్‌ను నేరుగా అందిస్తుండడంతో ట్రెండింగ్ పేజీకి ఆదరణ తగ్గుతూ వచ్చింది.
కొత్త కంటెంట్ క్రియేటర్లను ప్రోత్సహించేందుకు ‘హైప్’ ఫీచర్ తదితర కొత్త టూల్స్‌ను యూట్యూబ్ పరిచయం చేయనుంది.