యూపీఐ లైట్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. లావాదేవీల లిమిట్‌ పెంపు.. ఎంతంటే..

04 March 2025

Subhash

వినియోగదారులు ఎప్పుడైనా రూ.1,000 కంటే తక్కువ లావాదేవీలను పిన్ లేకుండా చెల్లించేందుకు యూపీఐ లైట్‌ లావాదేవీలను ఎన్‌పీసీఐ అందబాటులోకి తీసుకొచ్చింది. 

 పిన్ లేకుండా

యూపీఐ లైట్‌ ఖాతాలో రూ.5000 వరకు లోడ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉంది. ఆఫ్‌లైన్ మోడ్‌లో చిన్న విలువ డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడానికి ఆర్‌బీఐ జారీ చేసింది.

యూపీఐ లైట్‌

జనవరి 3, 2022న యూపీఐ లైట్‌ను ప్రవేశపెట్టారు. అనంతరం ఆగస్టు 27 2024లో యూపీఐ లైట్‌లో ఆటో టాప్-అప్‌ను ప్రవేశపెట్టారు. 

యూపీఐ లైట్‌

ఆటో టాప్-అప్ ద్వారా వినియోగదారుడు ఎంచుకున్న ఏ మొత్తం ద్వారానైనా బ్యాలెన్స్‌ను రీలోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా యూపీఐ లైట్‌ ద్వారా వినియోగదారులు సింపుల్‌ నగదు చెల్లింపులను చేయవచ్చు. 

ఆటో టాప్-అప్

 యూపీఐ లైట్ యాప్‌ను తెరిచి పేమెంట్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆపై మీరు యూపీఐ పిన్‌ను నమోదు చేయకుండానే నగదు మొత్తాన్ని ఎంటర్‌ చేసి ట్రాన్స్‌ఫర్‌ చేయవచ్చు. 

యూపీఐ లైట్ యాప్‌

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) తన తాజా సర్క్యులర్ ద్వారా గత సంవత్సరం ఆర్‌బీఐ ప్రకటనకు అనుగుణంగా యూపీఐ లైట్‌ కోసం కొత్త పరిమితులను ప్రవేశపెట్టింది. 

ఎన్‌పీసీఐ

యూపీఐ లైట్‌ ప్రతి లావాదేవీకి రూ.1,000కి పెంచింది. అలాగే యూపీఐ లైట్‌ యాప్‌ ద్వారా రోజుకు రూ.5,000 లావాదేవీలు చేసుకునే అవకాశం ఇచ్చింది. 

యూపీఐ లైట్‌

ప్రస్తుతం ఈ పరిమితి రూ.2000గా ఉంది. యూపీఐ లైట్‌లో ఆటో టాప్-అప్ ద్వారా సొమ్మును లోడ్‌ చేసుకోవచ్చు. ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం సభ్యులందరికీ ఈ సేవలు ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి వచ్చాయి. 

యూపీఐ లైట్‌లో

అలాగే యూపీఐ లైట్‌ను జారీచేసే బ్యాంకులు గత ఆరు నెలల్లో ఎలాంటి లావాదేవీలు జరపని యూపీఐ లైట్‌ ఖాతాలను గుర్తించాలని ఎన్‌పీసీఐ బ్యాంకులను ఆదేశించింది.

యూపీఐ లైట్‌