పండుగ డబుల్ బొనాంజా.. ధరలు తగ్గేవి.. పెరిగేవి ఇవే.!

04 September 2025

Samatha

సామాన్యులకు ఆర్థఇక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. జీఎస్టీలో కొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. సెప్టెంబర్ 22 నుంచి రోజూ వారి వస్తువులు చౌకగా లభించనున్నాయి.

జీఎస్టీ కౌన్సిల్ 56వ సమావేశంలో పన్ను రేట్లను క్రమబద్ధీకరించడం జరిగింది. దీంతో రోజూ వారీ వస్తువులు చాలా చౌకగా లభించనున్నాయి. మరి అవి ఏవో చూసేద్దాం.

రోజూవారీ నిత్యవసర వస్తువులు హెయిర్ ఆయిల్, టాయిలెట్ సబ్బులు, షాంపూలు, టూత్ బ్రష్‌లు, టూత్‌పేస్ట్, సైకిళ్లు, కిచెన్‌వేర్ పై 5% నుంచి 18 %తగ్గాయి

ఆహార ఉత్పత్తులు మ్‌కీన్, భుజియా, సాస్‌లు, పాస్తా, నూడుల్స్, చాక్లెట్లు, కాఫీ, కార్న్‌ఫ్లేక్స్, వెన్న, నెయ్యి వంటి వాటిపై 5% తగ్గాయి.

గృహ నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంట్ 28% నుంచి 18% కు తగ్గగా, సౌర ప్యానెల్స్, విండ్‌మిల్స్, బయోగ్యాస్ ప్లాంట్లు పై 5% తగ్గింది.

ఆటోమొబైల్స్, మన్నికైన వస్తువులు ఎయిర్ కండిషనర్స్, డిష్ వాష్, టీవీలు, చిన్న కార్లు, మోటారు సైకిల్లు, త్రిచక్ర వాహనాలపై 28 శాతం నుంచి 18% తగ్గింది.

ఆరోగ్య సంరక్షణ , క్యాన్సర్ వంటి 33 దీర్ఖకాలిక వ్యాధులపై గతంలో 12 శాతం పన్ను విధించగా, ఈ సారి వాటిపై పన్ను రేటును పూర్తిగా తొలిగించింది.

వ్యవసాయం, కూలి ఆధారిత వస్తువులు  ట్రాక్టర్లు, హార్వెస్టింగ్ మెషీన్లు, బయో-పెస్టిసైడ్లు, హస్తకళలు, లెదర్ గూడ్స్ వంటి వాటిపై 5% తగ్గింది.