ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునే వాళ్లకు బ్యాడ్‌ న్యూస్‌.. ఎందుకో తెలుసా?

04 October, 2025

Subhash

నేటి సమాజంలో ఆధార్‌ కార్డు (aadhaar card) వినియోగం ఎంత కీలకంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. 

ఆధార్‌ కార్డు

ఇంటి చిరునామాలు మారుతుండడంతో అటు అధికారులు, ఇటు ఆధార్‌ కార్డుదారులు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎప్పటికప్పుడు ఆధార్‌ను అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

చిరునామాలు

ఆధార్‌లో మార్పులు, చేర్పులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఎప్పటికప్పుడు అవకాశం కల్పిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. 

ఆధార్ కార్డు

ఈ నేపథ్యంలో ఆధార్ అప్ డే‌ట్‌ సర్వీసు ఛార్జీలను ఉడాయ్‌ తాజాగా సవరించింది. పెరిగిన ఛార్జీలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. 

అప్ డే‌ట్‌

ఇవి సెప్టెంబర్ 30, 2028 వరకు చెల్లుబాటు అవుతాయి. సర్వీసును బట్టి ఛార్జెస్‌లో మార్పులు ఉంటాయి. ఉడాయ్‌ సవరించిన ఆ సర్వీసు ఛార్జీలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఛార్జెస్‌

డెమోగ్రాఫిక్ అప్‌డేట్స్.. పేరు, చిరునామా, పుట్టిన తేదీ, మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ వివరాల అప్‌డేట్‌కు రూ. 75 ఖర్చవుతుంది. గతంలో ఇది రూ. 50గా ఉండేది.

డెమోగ్రాఫిక్ అప్‌డేట్స్

బయోమెట్రిక్ అప్‌డేట్.. ఫింగర్ ప్రింట్, ఐరిస్, ఫోటో వంటివి అప్ డేట్ చేసుకోవాలంటే ఇకపై రూ.125 చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ ఇది రూ.100గా ఉండేది. 

బయోమెట్రిక్ అప్‌డేట్

మై ఆధార్ పోర్టల్ ద్వారా డాక్యుమెంట్ అప్‌డేట్ జూన్ 14, 2026 వరకు ఉచితంగా చేసుకోవచ్చు. అదే నమోదు కేంద్రాల్లో అయితే రూ.75 ఖర్చవుతుంది. గతంలో ఇది రూ.50.

మై ఆధార్

5 నుంచి 7 ఏళ్ల పిల్లలకు బయోమెట్రిక్‌ అప్‌డేట్‌ను ఉచితంగా చేసుకోవచ్చు. ఆ పైన 15 నుంచి 17 ఏళ్ల పిల్లలకు ఒకసారి ఫ్రీ. 7 నుంచి15 సంవత్సరాల వయస్సు పిల్లలకు సాధారణంగా రూ. 125 వసూలు చేస్తారు.

బయోమెట్రిక్‌