3 July, 2025
Subhash
దేశీయ మార్కెట్లో ఎలక్ట్రీక్ వాహనాల హవా కొనసాగుతున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌తో వాహనాలను విడుదల చేస్తున్నాయి కంపెనీలు.
ఇక ద్విచక్ర వాహనాలలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల అవుతున్నాయి. తక్కువ ధరల్లోనే ఎక్కువ మైలేజీ ఇచ్చే స్కూటర్లు వస్తున్నాయి.
ప్రముఖ వాహన సంస్థ టీవీఎస్ మోటర్.. మార్కెట్లోకి సరికొత్త ఐక్యూబ్ ఈ-స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మెరుగైన ఫీచర్స్‌తో తీర్చిదిద్దిన ఈ మాడల్ ధరను రూ.1.03 లక్షలుగా నిర్ణయించింది టీవీఎస్ కంపెనీ.
హిల్ హోల్డ్ అసిస్ట్, 3.1 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన ఈ మాడల్ సింగిల్ చార్జింగ్‌తో వస్తుంది. అలాగే ఒక్క సారి ఛార్జింగ్‌తో 123 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనున్నట్లు కంపెనీ తెలిపింది.
ఇప్పటికే ఐక్యూబ్ మాడల్ 6 లక్షల యూనిట్లకు పైగా అమ్ముడయ్యాయి. ఈ కొత్త వేరియంట్ ప్రతిరోజు ప్రయాణించడానికి అనుకూలంగా రూపొందించింది.
డ్యూయల్ టోన్ కలర్స్, బ్యాక్‌రెస్ట్, బ్యాటరీ కెపాసిటీని అప్‌గ్రేడ్ చేసి ఈ మాడల్‌ను అభివృద్ధి చేసినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఇలా ఒక్కసారి ఛార్జింగ్‌తో ఎక్కువ మైలేజీ ఇచ్చే వాహనాలు చాలా విడుదలవుతున్నాయి. చాలా మంది ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు.