పాత ఫోన్లతో కొత్త బంగారం ఫ్రీ.. ఎలా అంటే?

Samatha

19 august  2025

Credit: Instagram

ప్రస్తుతం ఫోన్ అనేది ప్రతి వ్యక్తి జీవితంలో ఒక భాగం అయిపోయింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్ వాడటం చాలా కామన్.

అయితే ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు కానీ ఇవి రాకముందు ఎక్కువగా చిన్న ఫోన్స్ వాడేవారు. ఇక స్మార్ట్ ఫోన్ వచ్చాక చాలా మంది వీటిని పక్కన పడేశారు.

దీంతో ప్రస్తుం చాలా మంది ఇళ్లలో పాత కీప్యాడ్ ఫోన్స్, కరాబైన స్మార్ట్ ఫోన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటిని దేనికి పనికిరావు అని చాలా మంది ఇనుప సామాను వారికి వేయడం చేస్తారు.

ఇంకొంత మంది వీటిని బయట పడేస్తుంటారు. కానీ వీటితో ఫ్రీగా బంగారం పొందవచ్చు అని చెబుతున్నారు నిపుణులు. అది ఎలా అనుకుంటున్నారా? ఇప్పుడే చూసేద్దాం పదండి మరి!

బంగారం విలువ రోజు రోజుకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే శాస్త్రవేత్తలు ఫ్రీగా పాత వాటి నుంచి కొంత బంగారం పొందే మార్గాన్ని కనిపెట్టారు. ఎలక్ర్టానిక్ వస్తువుల నుంచి బంగారం తీస్తున్నారు.

స్మార్ట్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ పాతవి పడేస్తుంటారు. అయితే ఒక రిపోర్ట్ ప్రకారం, ఎలాక్ట్రానిక్ వేస్ట్ 82 శాతం ఉండగా,2030 నాటికి 8.2 టన్నులకు చేరుతుందంట.

అయితే ఇది వేస్ట్ కాదు, దీని నుంచి బంగారం, వెండిర, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా పొందవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు, కెమికల్స్ లేకుండా, పర్యావరణానికి హాని లేకుండా బంగారం తీయవచ్చునంట.

దీని కోసం trichloroisocyanuric acid అనే కెమికల్‌ని వాడి ఒక హాలైడ్ క్యాటలిస్ట్ యాడ్ చేసి బంగారాన్ని ఆక్సిడైజ్ చేస్తారు. దీనికి పాలిమర్ సోర్బెంట్ వినియోగిస్తారంట.

ది పాలిమర్ కరికి, బంగారం మాత్రమే బయటకు వస్తుందంట.  ఇలా  డీపాలిమరైజేషన్ ద్వారా పాత ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి హై ప్యూరిటీ బంగారాన్ని తీస్తారంట.