21 January 2025
Subhash
జియో రూ.2025తో ఓ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో ప్రతిరోజూ 2.5 GB హై స్పీడ్ డేటా, లోకల్, STD నెట్‌వర్క్‌లలో అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తోంది.
అలాగే ప్రతిరోజూ 100 SMSలను అందిస్తుంది. Reliance Jio ఈ రీఛార్జ్ ప్లాన్‌తో 200 రోజుల చెల్లుబాటు అందిస్తోంది.
ప్రతి రోజు 2.5 GB హై స్పీడ్ డేటా ప్రకారం, ఈ ప్లాన్ మీకు మొత్తం వ్యాలిడిటీలో 500 GB హై స్పీడ్ డేటా ప్రయోజనాన్ని అందిస్తుంది.
ఈ రూ.2025 ప్లాన్‌తో జియో టీవీ , జియో సినిమా, జియో క్లౌడ్‌కి ఉచిత యాక్సెస్ అందిస్తోంది.ఈ ప్లాన్‌తో అపరిమిత 5G డేటా లభిస్తుంది. ఇందులో జియో సినిమా ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉండదు.
Jio న్యూ ఇయర్ ఆఫర్ కింద, మీరు Ajio నుండి 2999 రూపాయలకు షాపింగ్ చేస్తే, మీకు 500 రూపాయల తగ్గింపుతో కూడిన కూపన్ లభిస్తుంది.
మీరు EaseMyTrip నుండి విమాన టిక్కెట్లను బుక్ చేసుకుంటే, మీకు 1500 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది.
ఇది మాత్రమే కాదు, మీరు Swiggy నుండి రూ. 499 కొనుగోలుపై రూ. 150 తగ్గింపును కూడా పొందుతారు. ఈ ప్లాన్‌తో రూ. 2150 ప్రయోజనాన్ని పొందుతున్నారు.
మీరు ఈ ఆఫర్ ప్రయోజనాన్ని జనవరి 31, 2025 వరకు మాత్రమే పొందగలుగుతారు. అప్పటి వరకు మాత్రమే గడువు ఉంటుందని గుర్తించుకోండి.