10 June, 2025
Subhash
ప్రధాని నరేంద్ర మోడీ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను ప్రవేశపెడుతున్నారు. దీంతో రైతులు ఆర్థికంగా సహాయం పొందుతున్నారు.
మోడీ సర్కార్ రైతుల కోసం ప్రవేశపెట్టిన పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ ఒకటి. ఈ స్కీమ్ ద్వారా రైతులు ప్రతి ఏడాది ప్రభుత్వం సాయం పొందుతున్నారు.
ఈ పీఎం కిసాన్ పథకంలో ప్రతి ఏడాది 6000 రూపాయల చొప్పున రైతులు అందుకుంటున్నారు. ఇది మూడు విడతల్లో రైతులకు అందుతుంది.
ప్రతి విడతకు 2000 రూపాయల చొప్పున ఇలా మూడు విడతల్లో అందుకుంటారు. అయితే రైతులు పొరపాట్లు చేస్తే వచ్చే 20వ విడత డబ్బులు అందవు.
ఇప్పటి వరకు రైతులు 19వ విడత డబ్బులను అందుకున్నారు. ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది. అది కూడా జూన్ నెలలో వచ్చే అవకాశం ఉంది.
ఈ పథకం ప్రయోజనం పొందుతున్న రైతులు తప్పనిసరిగ్గా ఈ కేవైసీ చేసుకోవాల్సి ఉంది. అంటే ఆధార్ వివరాలతో పాటు ఇతర వివరాలు అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంది.
ఈ కేవైసీ చేసుకోని రైతులకు వచ్చే 20వ విడత డబ్బుల అందవని గుర్తించుకోండి. దీనిని చేసేందుకు మీ మొబైల్‌లోగానీ, మీ సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాల్లో చేసుకునేందుకు అవకాశం ఉంది.
ఈ స్కీమ్‌కు సంబంధించి వివరాలు అప్‌డేట్ చేసుకోకుంటే వచ్చే విడత నిధులు నిలిచిపోవచ్చు. వెంటనే రైతులు ఈ పని చేసుకోవడం చాలా ముఖ్యమని అధికారులు పదేపదే సూచిస్తున్నారు.