8 July, 2025
Subhash
ఢిల్లీలో పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం జూలై 1 నుండి కఠినమైన నిర్ణయాలను తీసుకుంటోంది.
10 ఏళ్ల కంటే పాత డీజిల్ వాహనాలు, 15 ఏళ్ల కంటే పాత పెట్రోల్ వాహనాలను స్వాధీనం చేసుకుంటున్నారు అధికారులు.
అయితే CNG కార్ల యజమానులకు ప్రస్తుతానికి ఉపశమనం లభించింది. ప్రస్తుతానికి వారి వాహనాలపై ఎటువంటి నిషేధం ఉండదు.
పాత పెట్రోల్, డీజిల్ వాహనాలకు ఇంధనం నింపకుండా నిరోధించడానికి తనిఖీ బృందాలు ప్రస్తుతానికి పెట్రోల్ పంపుల వద్ద మాత్రమే ఉంటాయని ఢిల్లీ రవాణా కమిషనర్ నిహారిక రాయ్ అన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం రాజధానిలోని పెట్రోల్ పంపుల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ (ANPR) కెమెరాలను ఏర్పాటు చేసింది.
ఈ కెమెరాలు నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి వాహనం లైఫ్‌టైమ్‌ను గుర్తిస్తాయి. నిర్దేశించిన పరిమితి కంటే పాత వాహనం అయితే, దానిని అక్కడ స్వాధీనం చేసుకుని స్క్రాపింగ్ కోసం పంపుతారు.
సుప్రీంకోర్టు ఆదేశాలతో ఢిల్లీ ప్రభుత్వం రాజధానిలోని పెట్రోల్ పంపుల వద్ద ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రీడింగ్ కెమెరాలను ఏర్పాటు చేసింది.
అదే సమయంలో పాత ట్రక్కులు, బస్సులను కూడా పట్టుకునేలా సరిహద్దులో కెమెరాలను ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి.