తక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం.. ఈ స్కీమ్ మీ కోసమే..
21 September 2025
Prudvi Battula
ఇండియన్ పోస్ట్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్‌లో మమీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే సురక్షితంగా, లాభదాయకంగా ఉంటాయి.
ఈ TD పథకం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD)ని పోలి ఉంటుంది. అయితే ఇందులో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి.
తపాలా శాఖలో TD పథకంలో ఇన్వెస్ట్ చేస్తే 6.9 శాతం నుంచి 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఒకటి నుంచి 5 సంవత్సరాల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు.
ఇండియన్ పోస్ట్ టైమ్ డిపాజిట్ (TD) స్కీమ్‌లో కనీసం రూ. 1,000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. గరిష్ట డిపాజిట్ కోసం ఎలాంటి పరిమితి లేదు.
ఇండియన్ పోస్ట్ టైమ్ డిపాజిట్ స్కీమ్‌లో వడ్డీ మీరు చేసిన డిపాజిట్, దాని పెట్టుబడి వ్యవధిపై ఆధారపడి ఉంటుంది.
భారత తపాలా శాఖ TD స్కీమ్ కింద ఎవరైనా ఖాతా తెరవవచ్చు. ఇందులో మీ కుటుంబం కోసం ఉమ్మడి ఖాతాను కూడా తెరవవచ్చు.
పోస్టాఫీసు ప్రభుత్వ సంస్థ అవడం వల్ల పెట్టే డబ్బు సురక్షితంగా ఉంటుంది. TD ఖాతాను తెరవాలంటే దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీస్‌కు వెళ్ళండి.
తపాలా కార్యాలయంలో దరఖాస్తు ఫారమ్ ఫిల్ చేసి గుర్తింపు రుజువు, చిరునామా రుజువు. పాస్‌పోర్ట్ సైజు ఫోటో వంటి పత్రాలతో సమర్పిస్తే ఖాతా ఓపెన్ చెయ్యవచ్చు.
మరిన్ని వెబ్ స్టోరీస్
పితృ పక్షం రోజున ఇలా చేస్తే.. పితృ దోషం నుంచి ఉపశమనం..
ఎండు చేపలు పోషకాల భాండాగారం.. డైట్లో ఉంటే.. అనారోగ్యంపై దండయాత్రే..
విటమిన్ డి సహజంగా పెరగాలంటే ఏం చేయాలి?