రికార్డు ధర పలికిన పచ్చి కొబ్బరి.. ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే.. 

03 September 2025

Prudvi Battula 

పచ్చి కొబ్బరికాయలకు మునుపెన్నడూ లేనంతగా ధర వచ్చింది. కోనసీమ మార్కెట్‌ చరిత్రలో ఇది అరుదైన రికార్డుగా చెబుతున్నారు.

కోనసీమ మార్కెట్‌‎లో పచ్చి కొబ్బరికాయలకి చరిత్రలో మునుపెన్నడూ లేనంతగా అరుదైన రికార్డుగా ధర వచ్చింది.

మూడు రోజుల క్రితం వెయ్యి కొబ్బరికాలు రూ.22 వేలు ధర ఉండగా ఇప్పుడు ఇది రూ.23 వేల నుంచి రూ.24 వేల వరకు పలుకుతుంది.

కోనసీమలోని ప్రాంతాలను బట్టి కొందరు వ్యాపారులు పచ్చి కొబ్బరికాయలకు ఈ ధరకు కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు.

పరిమాణం, నాణ్యత, బరువును బట్టి కొన్ని ప్రాంతాల్లో వెయ్యి పచ్చి కొబ్బరికాయలు రూ.25 వేలకు చేరువలో ఉన్నాయి.

ఈ నెలలో కాయల పరిమాణం ఆశాజనకంగా ఉన్నందున వచ్చే నెలలో బాగా తగ్గిపోయి చిన్నవి వస్తాయి. దీంతో వ్యాపారులు క్యూ కట్టారు.

వర్తకులు రైతుల వద్ద నుంచి ఇప్పుడే పెద్దఎత్తున కొబ్బరికాయలు కొనుగోలు చేసి గోడౌన్‎లో నిల్వ చేసుకుంటున్నారు.

దీంతో రోజుల వ్యవధిలోనే ధరలో పెరుగుదల కనిపిస్తోంది. పొరుగు రాష్ట్రాలతో పాటు ఏపీలోని పలు జిల్లాలకు ఎగుమతులు జోరందుకున్నాయి.

రానున్న దసరాకు మంచి ధర వస్తుందని ఆశగా ఉన్నప్పటికీ మరోవైపు దిగుబడులు సన్నగిల్లి గతంలో ఎకరాకు వెయ్యి కాయలు వస్తే ఇప్పుడు సగానికి తగ్గి కొరత ఏర్పడింది.