మీ బంగారు నగలు అద్దెకు ఇస్తే.. నెలకు లక్షల్లో సంపాదించే ఛాన్స్!
05 May 2026
Jyothi Gadda
అయితే, లాకర్లో ఉండే ఆ బంగారం ద్వారా కూడా ప్రతి నెలా మంచి ఆదాయాన్ని సంపాదించవచ్చని మీకు తెలుసా? అదే బంగారు ఆభరణాల అద్దె వ్యాపారం. ప్రస్తుతం ఈ వ్యాపారానికి డిమాండ్ ఎక్కువగా ఉంది!
ప్రస్తుతం బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం పెళ్లి సమయంలో భారీ నెక్లెస్‌లు లేదా వడ్డాణాలు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారుతోంది.
కేవలం ఒక్క రోజు వేడుక కోసం లక్షలు వెచ్చించే బదులు, కొన్ని వేల రూపాయలకే అద్భుతమైన ఆభరణాలను అద్దెకు తీసుకోవడానికి నేటి తరం ఆసక్తి చూపుతోంది. అయితే, ఈ వ్యాపారం ఎలా ప్రారంభించాలి?
మీ వద్ద ఉన్న పాత, కొత్త డిజైన్ల నగలను ఈ వ్యాపారానికి ఉపయోగించవచ్చు. ఒక చిన్న షాపు ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా మీ నగలను ప్రదర్శించవచ్చు.
సాధారణంగా నగ విలువలో 1శాతం నుండి 2శాతం వరకు ఒక రోజుకు అద్దెగా వసూలు చేస్తారు. ఉదాహరణకు, 10 లక్షల విలువైన సెట్‌కు రోజుకు రూ. 10,000 నుండి రూ. 20,000 వరకు సంపాదించవచ్చు.
బంగారం అత్యంత విలువైనది కాబట్టి, ఈ వ్యాపారంలో భద్రత చాలా ముఖ్యం. అందువల్ల నగలు అద్దెకు తీసుకునే వారి నుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ఒరిజినల్ పత్రాలను తప్పక పరిశీలించాలి.
నగ విలువలో కొంత శాతాన్ని ముందే డిపాజిట్‌గా తీసుకోవాలి. నష్టం వాటిల్లితే లేదా చోరీ జరిగితే ఎవరు బాధ్యత వహించాలనే దానిపై స్పష్టమైన ఒప్పందం ఉండాలి. మీ ఆభరణాలకు ఇన్సూరెన్స్ ఉంటే మంచిది.
శుభకార్యాల సీజన్లో ఈ వ్యాపారం ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం పొందే అవకాశం ఉంది. మీరు కూడా కొత్తగా ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటే, ఈ గోల్డ్ రెంటల్ ఐడియాను పరిశీలించవచ్చు.