ప్రపంచంలోనే చౌకగా బంగారం లభించే దేశం ఇదే? డెడ్ చీప్ భయ్యో..
venkata chari
29 July 2025
Credit: Instagram
భారతదేశంలో బంగారం ధర రోజురోజుకూ పెరుగుతోంది. దాదాపు రూ. లక్ష చేరుకుంది. దీంతో ప్రజలు బంగారం కొనాలంటే భయపడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా బంగారం ధరలు నిత్యం మారుతూనే ఉంటాయి. ఒక రోజు తగ్గితే, మరో రోజూ పెరుగుతూ ఉంటాయి. అప్పడప్పుడూ ధరలో మార్పులు ఉండవు.
అయితే, ప్రపంచంలో అత్యంత చౌకైన బంగారం ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? ఇలాంటి ఒక చోటు ఉందని మీకు తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత చౌకైన బంగారం భారతదేశ పొరుగు దేశమైన భూటాన్‌లో లభిస్తుంది. భూటాన్‌లో బంగారం చౌకగా లభించడానికి అనేక కారణాలు ఉన్నాయి.
నిజానికి, భూటాన్‌లో బంగారం పన్ను రహితం, బంగారం చౌకగా ఉండటానికి ఇదే అతిపెద్ద కారణం.
భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర రూ.76,282 ఉంటే, భూటాన్‌లో అదే బంగారం రూ.47,731 భూటానీస్ న్గుల్తామ్‌గా ఉంటుంది.
దీంతో పాటు, భూటాన్‌లో బంగారంపై దిగుమతి సుంకం తక్కువగా ఉంటుంది. అందుకే అక్కడ బంగారం చాలా తక్కువ ధరకు లభిస్తుంది.
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బంగారం నాణ్యత విషయంలో అస్సలు రాజీ పడవద్దు.
బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో పెద్ద మొత్తంలో డబ్బులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. బంగారం ధర భారీగా పెరగడానికి అంతర్జాతీయంగా స్టాక్ మార్కెట్లు కూడా ఓ కారణం కావొచ్చు.