భారీగా పెరగనున్న బంగారం ధర.. తులం ధర తెలిస్తే కన్నీరు పెట్టాల్సిందేనంట!

samatha 

07  JUN  2025

Credit: Instagram

బంగారం ధర రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతుంది. చాలా మంది బంగారం ధర చూసి షాక్ అవుతున్నారు. గోల్డ్ కొనుగోలు చేయాలంట జంకుతున్నారు.

మహిళలు ఎక్కువ ఇష్టపడే దాంట్లో బంగారమే ముందుంటుంది. అంతే కాకుండా, ఏ చిన్న ఫంక్షన్, పార్టీ జరిగినా సరే మొదటి ప్రాధాన్యత బంగారానికే ఇస్తారు.

ఇక ఇంట్లో పెళ్లి ఉంటే చాలు.. అందరి చూపు బంగారం వైపే ఉంటుంది. అంత ప్రియారిటీ ఉండే బంగారం సామాన్యుల పాలిట శాపంగా మారుతుంది.

తులం బంగారం కొనుగోలు చేయాలంటే, సామాన్యుల భయపడాల్సిన పరిస్థితులు ఎదురు అవుతున్నాయి. ఇప్పటికే లక్షకు బంగారం ధర చేరిన విషయం తెలిసిందే.

అయితే ఈ సంవత్సరంలో గోల్డ్ రేటు రూ. 1.10,000 దాటనున్నదంట. కాగా, దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తాజాగా బంగారం పై ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ఆ నివేధిక ప్రకారం.. ఈ సంవత్సరం బంగారం ధర ముట్టుకుంటే మండిపోయే రేంజ్‌లో పెరగనున్నదంట.

ఏకంగా 10 గ్రాముల బంగారం ధర రూ. లక్షా 10 వేలకు చేరుకోనున్నదని ఆ నివేదిక తెలిపింది. దీంతో ఇది చూసినవారందరూ ఒక్కసారిగా షాక్‌కు గురి అయ్యారు.

ఎకనామిక్స్ టైం కథనంలో ప్రచురించిన ఏంజెల్ వన్ నివేధిక ప్రకారం భారత దేశంలో ఈ ఏడాది చివరి వరకు బంగారం ధర రూ.లక్షా 10 వేలకు చేరనుందని తెలిపింది.