10 September, 2025
Subhash
పండుగ సీజన్ రాబోతోంది. పండుగ సీజన్ కు ముందే బంగారం భగ్గుమంటోంది. బుధవారం బంగారం ధర పెరిగి కొత్త శిఖరాలను తాకింది.
ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకుల బలమైన కొనుగోళ్లు, బలహీనమైన డాలర్, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా దేశ రాజధానిలో బంగారం మరింత పెరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాములకు రూ.250 పెరిగి 1,13,000 రూపాయలకు చేరుకున్నాయి. దీంతో సామాన్యుడు బంగారం కొనాలంటే జంకుతున్నాడు.
2025లో బంగారం ధరలో భారీ పెరుగుదల నమోదైంది. ఈ సంవత్సరం ఇప్పటివరకు దాని ధరలు రూ.34,050 లేదా 43.12 శాతం పెరిగాయి.
డిసెంబర్ 31, 2024న బంగారం ధర 10 గ్రాములకు 78,950 రూపాయల నుంచి 1,12,750 రూపాయలకు చేరుకుంది.
ఆల్ ఇండియా సరాఫా సంఘ్ ప్రకారం, మంగళవారం బంగారం ధర 10 గ్రాములకు రూ.5,080 పెరిగి రూ.1,12,750 వద్ద ముగిసింది. ఈ విధంగా గత రెండు రోజుల్లో ఇది రూ.5,330 పెరిగింది.
బుధవారం 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం కూడా రూ.250 పెరిగి ఆల్ టైమ్ హై 10 గ్రాములకు రూ.1,12,500 (అన్ని పన్నులతో సహా)కు చేరుకుంది.
ఇదిలా ఉండగా బుధవారం వెండి ధర కూడా పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,30,000కి (అన్ని పన్నులు కలిపి) చేరుకున్నాయి. అసోసియేషన్ ప్రకారం, గత సెషన్‌లో వెండి కిలోకు రూ.1,28,800 వద్ద ముగిసింది.