మళ్లీ మహిళలకు షాకిచ్చిన బంగారం ధర.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?

2 July, 2025

Subhash

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి సడెన్ షాక్ తగిలింది. గత పది రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధరలు ఇవాళ ఒక్కసారిగా పెరిగాయి. 

బంగారం ధర

24 క్యారెట్ల బంగారం ధర10 గ్రాములపై ఏకంగా 490 రూపాయలు పెరిగి ప్రస్తుతం 98,890 రూపాయల వద్ద కొనసాగుతోంది.

24 క్యారెట్ల బంగారం ధర

ఇక 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 450 రూపాయలు ఎగబాకింది. ప్రస్తుతం ధర 90,650 రూపాయల వద్ద కొనసాగుతోంది. 

22 క్యారెట్ల బంగారం ధర 

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 98,890 రూపాయలు ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 90,650 రూపాయల వద్ద ఉంది.

హైదరాబాద్‌లో

ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి ధర లక్షా 10 వేల రూపాయలు ఉండగా, కొన్ని ప్రాంతాల్లో లక్షా 20 వేల వరకు ఉంది.

కిలో వెండి ధర

మీ ఆభరణాలపై గుర్తించబడిన హాల్‌మార్క్ ద్వారా మీరు బంగారం స్వచ్ఛతను సులభంగా తెలుసుకోవచ్చు. ఎక్కువగా 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీలో ఉపయోగిస్తారు.

 హాల్‌మార్క్

కొంతమంది 18 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన ఆభరణాలను పొందుతారు. మీరు తయారు చేసిన ఆభరణాలకు బంగారం స్వచ్ఛతను సూచించే గోల్డ్ హాల్‌మార్క్ ఉంటుంది.

18 క్యారెట్లు

24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 22 క్యారెట్లపై 916, అలాగే18 క్యారెట్లపై 750 అని రాసి ఉంటుందని గుర్తించుకోండి.

24 క్యారెట్లు