EPFO 3.0కి రంగం సిద్ధం.. బెనిఫిట్స్ తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..

02 September 2025

Prudvi Battula 

EPFO ​​3.0 అప్‌గ్రేడ్‎ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దీని ద్వారా 8 కోట్లకు పైగా PF ఉద్యోగులకు అందించే సేవలు మరింత వేగవంతంగా, యూజర్ ఫ్రెండ్లీగా మారనున్నాయి.

కొత్త ప్లాట్‌ఫామ్ నిర్వహణకి ఇన్ఫోసిస్, విప్రో, టిసిఎస్ వంటి అగ్రశ్రేణి భారతీయ టెక్ కంపెనీలు షార్ట్‌లిస్ట్ చేయబడినట్లు సమాచారం.

EPFO 3.0 జూన్ 2025కి రావాల్సినప్పటికీ సాంకేతిక పరీక్షల కోసం ఆలస్యం అయింది. అప్‌గ్రేడ్ చేయబడిన EPFO ​​ప్లాట్‌ఫామ్ ఐదు కీలక ప్రయోజనాలు చూద్దామా.

ATM ద్వారా నేరుగా నిధులను విత్‏డ్రా చేసుకోవడం EPFO ​​3.0లో మొదటి బెనిఫిట్. ఇది అత్యవసర నగదు అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.

PF సభ్యులు UPI ద్వారా తమ నిధులను సులభంగా విత్‏డ్రా చేసుకోవచ్చు. ఇది ఉద్యోగులకు వారి పొదుపులను తక్షణమే పొందేందుకు వీలు కల్పిస్తుంది.

కొత్త EPFO ​​ప్లాట్‌ఫామ్ మరింత యూజర్ ఫ్రెండ్లీగా ఉండనుంది. యాక్సెస్‌ను వేగవంతం చేసి సభ్యులకు సౌలభ్యాన్ని పెంచుతుంది.

చిన్న చిన్న దిద్దుబాట్ల కోసం సభ్యులు ఇకపై EPFO ​​కార్యాలయాన్ని సందర్శించాల్సిన లేకండా OTP ద్వారా ఆన్‌లైన్‌లోని చేయగలరు. క్లెయిమ్ స్థితిని ట్రాక్ చేయగలరు. దీంతో టీం సేవ్ అవుతుంది.

EPFO సభ్యుడు మరణించిన సందర్భంలో క్లెయిమ్ ప్రక్రియను కూడా సులభతరం చేసింది. మైనర్లకు గార్డియన్‌షిప్ సర్టిఫికెట్లు ఇకపై తప్పనిసరి కాదు. సులభంగా, వేగంగా పరిష్కారాలు లభిస్తాయి.