10 February 2025
Subhash
కొత్త ప్లాన్స్ తీసుకొస్తున్న నేపథ్యంలో కొన్ని పాత ప్లాన్స్ ను నిలిపివేయాలని బిఎస్ఎన్ఎల్ నిర్ణయించింది.
అయితే ఈ ప్లాన్లు నిలిపివేసినా వాటి స్థానంలో వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు కల్పించేలా ప్లాన్స్ తీసుకురానున్నామని బిఎస్ఎన్ఎల్ అధికారులు చెబుతున్నారు.
తాజాగా BSNL తన కోట్లాది మంది వినియోగదారులకు షాక్ ఇస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ప్రీపెయిడ్ పోర్టు ఫోలియో నుంచి అత్యంత ప్రజాదరణ పొందిన మూడు ప్లాన్లను తొలగించింది.
ఈ మూడు చౌకైన రీఛార్జ్ ప్లాన్స్ కూడా ఈ నెల 10వ తేది తర్వాత యూజర్లకు అందుబాటులో ఉండవని బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీ తెలిపింది.
రూ. 201 ప్లాన్, రూ.797, రూ.2999 ప్లాన్లు ఇక ముందు కనిపించవు. ప్రస్తుతం రూ.201కు 90 రోజుల వ్యాలిడిటీ, రూ.797కు 60 రోజులు, రూ.2999కు 365 రోజుల వ్యాలిడిటీ, ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సదుపాయాలు.
రూ. 201 ప్లాన్ వాలిడిటీ 90 రోజులు. 300 నిమిషాల కాలింగ్, 6GB డేటా, ఈ ప్లాన్‌లో ఇతర ప్రయోజనాలు ఏవీ లేవు. సాధారణంగా కస్టమర్‌లు తమ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవడానికి ఈ ప్లాన్ ఎంచుకుంటారు.
300 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో మొదటి 60 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకి 2 జిబి డేటా, 100 SMSలు ఉంటాయి. 60 రోజుల తర్వాత ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు.
365 రోజుల వ్యాలిడిటీతో వచ్చే ఈ ప్లాన్ లో రోజుకి 3 జిబి డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, 100 SMSలు లభిస్తాయి. ఫిబ్రవరి 10 నుండి ఈ మూడు ప్లాన్లు నిలిపివేస్తున్నారు.