హోలీ పండగకు BSNL బంపర్‌ ఆఫర్‌.. 30 రోజుల పాటు ఉచిత వ్యాలిడిటీ!

04 March 2025

Subhash

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL హోలీ సందర్భంగా తన వినియోగదారులకు గొప్ప బహుమతిని ఇచ్చింది. ఈ సందర్భంగా కంపెనీ తన ప్లాన్లలో ఒకదాని చెల్లుబాటును ఒక నెల పొడిగించింది.

BSNL

ప్రభుత్వ టెలికాం సంస్థ BSNL ప్లాన్‌పై ఉండే వ్యాలిడిటీలో మరో 30 రోజుల పాటు ఉచితంగా చెల్లుబాటును అందిస్తోంది బీఎస్‌ఎన్‌ఎల్‌.

30 రోజుల పాటు

దీనితో పాటు, BSNL ఈ ప్లాన్‌లో 60GB డేటా కూడా పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. ఇప్పుడు హోలీ ఆఫర్‌తో, BSNL ఈ ప్లాన్‌లో కస్టమర్లకు 425 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. 

 BSNL

మీరు రీఛార్జ్ చేసిన తర్వాత మీరు దాదాపు 14 నెలల పాటు టెన్షన్ ఫ్రీగా ఉంటారు. BSNL ఈ ప్లాన్ ధర రూ. 2399. ఈ ప్లాన్‌లో లభించే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

14 నెలలు

బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం గొప్ప ఆఫర్‌తో ముందుకు వచ్చింది. బీఎస్ఎన్ఎల్ రూ.2,399 ప్లాన్ గతంలో 395 రోజుల చెల్లుబాటు, రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ ప్రయోజనాలను అందించింది. 

రూ.2,399 ప్లాన్ 

కానీ హోలీ సందర్భంగా బీఎస్ఎన్ఎల్ 30 రోజుల ఉచిత చెల్లుబాటు, రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్ అందిస్తోంది. 

హోలీ సందర్భంగా

బీఎస్‌ఎన్‌ఎల్‌ వినియోగదారులు ఇప్పుడు 425 రోజుల చెల్లుబాటు, అలాగే మొత్తం 850GB డేటాను పొందుతారు.

బీఎస్‌ఎన్‌ఎల్‌ 

BSNL రూ.2,399 ప్లాన్‌లో దీర్ఘకాలిక చెల్లుబాటుతో అపరిమిత ఉచిత కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. దీనితో పాటు, రోజుకు 100 ఉచిత SMSల ప్రయోజనం కూడా అందుబాటులో ఉంది. 

BSNL