యాంటీలియా అంబానీ కుటుంబం 27వ అంతస్తులోనే ఎందుకు నివసిస్తోంది? కారణమిదే

07 February 2025

Subhash

ముంబైలోని అల్టామౌంట్ రోడ్ లో 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో యాంటీలియా పేరుతో ముఖేస్‌ అంబానీ ఇల్లు నిర్మించారు.

యాంటీలియా 

ఈ ఇల్లు 27అంతస్తులు(27 floors). ఇంధ్రభవనం లాంటి ఈ ఇంట్లో ఉన్న అన్ని అంతస్తులు కాదని ముఖేష్ అంబానీ కుటుంబం 27వ అంతస్తులోనే నివసిస్తుంది. 

27వ అంతస్తులోనే ఎందుకు?

అంబానీ కుటుంబం 27వ అంతస్తులో ఉండడానికి గల కారణం కూడా ఉంది. ఇంత ఎత్తైన అంతస్తులో ఉండడానికి అంబానీ భార్య నీతా అంబానీ నిర్ణయమేనట.

నీతా అంబానీ

నీతా అంబానీకి ఇంట్లో అన్ని గదులకు గాలి, సూర్యరశ్మి ఉండటం ఇష్టమట. ఎంత ఏసీ గదులైనా, మరెంత లైట్ల వెలుగున్నా సహజమైన గాలి, వెలుతురుకు ఆమె ప్రాధాన్యత ఇస్తారు. 

గాలి, సూర్యరశ్మి

ఈ ఇంట్లో ముఖేష్ అంబానీ తల్లి కోకిలా బెన్, భార్య నీతా అంబానీ, కుమారులు ఆకాష్-అనంత్, కోడలు శ్లోక, అంబానీ మనరాళ్లు ఇలా అందరూ 27వ అంతస్తులోనే ఉంటున్నారు. వీరిది ఉమ్మడి కుటుంబం.

ఈ ఇంట్లో

వీరు ఉంటున్న 27వ అంతస్తులోకి వెళ్లాలంటే చాలామంది గార్డ్స్ ను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఈ కారణంగా వీరికి భద్రత కూడా ఎక్కువే. 

27వ అంతస్తు

ఈ ఇంట్లో 600మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో తోటమాలి, సెక్యురిటీ గార్డులు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు , డ్రైవర్లు, ఇంటి పని చేసేవారు ఇలా అందరూ ఉన్నారు. 

600 మంది సిబ్బంది 

అంబానీ ఇంట్లో పనిచేసేవారికి జీతాలు భారీగా ఉంటాయి. గరిష్టంగా ఒక మనిషికి రూ.2 లక్షల వరకు జీతాలు, పనివారికి వారి వారి సామర్థ్యాన్ని బట్టి వేతనాలు ఉంటాయని నీతా అంబానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు

జీతాలు