ఇంట్లో కలబంద మొక్కను ఈ దిశలో పెడితే.. దరిద్రాలు పోయి ధనలాభం వస్తుందట!

27 May 2026

Rajashekher

కలబంద మొక్కను ఆరోగ్యం, అందం కోసం మాత్రమే కాకుండా జ్యోతిష్య పరిహారాల కోసం కూడా ఉపయోగిస్తారని చెబుతున్నారు.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం కలబంద మొక్క శక్తివంతమైనది, ఇది ఉన్న ఇంట్లో ముక్కోటి దేవతల కటాక్షం ఉంటుందని నమ్మకం.

కలబంద ఆకుల్లో లక్ష్మీదేవి నివసిస్తారని భావించి, ఈ మొక్కను గౌరవంగా చూసుకోవాలని సూచిస్తున్నారు. మొక్క దగ్గర పరిశుభ్రంగా ఉంచాలి. 

కలబంద మొక్కను ఇంట్లో ఈశాన్యం లేదా వాయువ్యం దిశలో ఉంచితే శుభఫలితాలు వస్తాయని చెబుతున్నారు.

ఆగ్నేయ దిశలో కలబంద మొక్కను పెంచకూడదని, అలా చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

శుక్రవారం ప్రదోషకాలంలో కలబంద గుజ్జును మహాలక్ష్మీ దేవికి నైవేద్యంగా సమర్పించడం శుభప్రదమని అంటున్నారు.

ఆ తర్వాత ఆ గుజ్జును నీటిలో కలిపి స్నానం చేస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ప్రదోషకాలం అంటే సూర్యాస్తమయానికి సుమారు 24 నిమిషాల ముందు ఉండే సమయమని వివరిస్తున్నారు.

మంగళవారం ఉదయం 6 నుంచి 7 గంటల మధ్య కలబంద మొక్కను ఇంటి ముందు తలక్రిందులుగా వేలాడదీయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగుతుందని చెబుతున్నారు.