ప్రపంచంలోని మొట్టమొదటి ఎలైట్ కమాండో రెస్క్యూ మిషన్‌

16 November 2023

జూలై 4, 1976న, ఉగాండాలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన రెస్క్యూ ఆపరేషన్ థండర్‌బోల్ట్‌ను నిర్వహించింది ఇజ్రాయెల్.

జూన్ 27న విమానం హైజాక్ చేసిన దుండగులు నుంచి 100 మంది పౌరులను రక్షించేందుకు ఇజ్రాయెల్ కమాండో బృందం శత్రు దేశంలోకి ప్రవేశించింది.

పాపులర్ ఫ్రంట్ ఫర్ లిబరేషన్ ఆఫ్ పాలస్తీనాకు చెందిన నలుగురు ఉగ్రవాదులు విమానాన్ని హైజాక్ చేసి ఉగాండా చేరుకున్నారు.

ఉగాండా నియంత ఇదీ అమీన్ ఈ ఉగ్రవాదులను ఎంటెబ్బే విమానాశ్రయంలో తమ విమానాన్ని ల్యాండ్ చేయడానికి అనుమతించారు.

ఎయిర్‌పోర్టులో ఈ హైజాకర్లకు ఉగాండా సైనికులు భద్రత కల్పించారు. ఇజ్రాయెల్ సహా 4 దేశాల్లో జైలులో ఉన్న 53 మంది పాలస్తీనియన్లను విడుదల చేయాలని ఉగ్రవాదులు డిమాండ్ చేశారు.

జూలై 3న, ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆపరేషన్ థండర్‌బోల్ట్‌ను ఆమోదించింది. చీకటిలోనే ఎంటెబ్బే విమానాశ్రయంలో దిగాయి కమాండో బృందాలు.

ఈ రహస్య ఆపరేషన్‌లో, మొత్తం ఉగ్రవాదులతో సహా 50 మంది ఉగాండా ఆర్మీ సైనికులు మరణించారు. ముగ్గురు ఇజ్రాయెలీ బందీలు ప్రాణాలు కోల్పోయారు.

ఈ కమాండో ఆపరేషన్ కేవలం 60 నిమిషాల్లో పూర్తయింది. ప్రపంచంలోని మొట్టమొదటి ఎలైట్ కమాండో రెస్క్యూ మిషన్‌గా నిలిచింది.