20 October 2023
మరణించిన మనిషి చివర జర్నీలో కూడా భిన్నమైన పద్ధతులున్నాయి. ప్రపంచంలోని ఒక నగరంలో మాత్రం మనిషి మరణించడం నిషేధం.
నార్వేలోని లాంగ్‌ఇయర్‌బైన్‌లో రిమోట్, ఆర్కిటిక్ పట్టణం ఉంది,. ఇక్కడ గత 70 ఏళ్లల్లో ఒక మనిషి కూడా మరణించలేదు
ఈ ప్రాంతం అతి శీతల ప్రాంతం.. ఇదే ఇక్కడ మనిషి మరణాన్ని నిషేధించడానికి కారణమైంది
నార్వే ఉత్తర ధ్రువంలోని లాంగ్‌ఇయర్‌బైన్ నగరం ఏడాది పొడవునా చాలా చల్లగా ఉంటుంది. మనిషి జీవించాలంటే ఉన్ని దుస్తులను ధరించాల్సిందే
ఇంకా చెప్పాలంటే ఈ నగరం డీప్ ఫ్రీజర్ వంటిది. దీంతో మృత దేహాలు ఇక్కడ కుళ్లిపోవు.
పర్యావరణ కారణాల వల్ల ఈ నగరంలో చనిపోవడం నిషిద్ధం. అంతేకాదు చట్ట విరుద్ధం.. ఈ చట్టం ఇక్కడ 1950 నుండి అమల్లో ఉంది.
అప్పుడు మరణించిన వ్యక్తిని శ్మశానవాటికలో పాతి పెట్టారు. ఆ శవం కుళ్లిపోలేదు.. మట్టిలో కలిసిపోలేదు.
1918 లో ఖననం చేయబడిన మృతదేహంలో స్పానిష్ ఫ్లూ బ్యాక్టీరీయా ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అప్పటి నుంచి ఇక్కడ మరణించడాన్ని ప్రభుత్వం నిషేధించింది.
కేవలం 2వేలు జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎవరైనా మరణించే సమయం వస్తే.. హెలికాప్టర్‌లో మరో చోటుకి తీసుకుని వెళ్లి అక్కడే అంత్యక్రియలు పూర్తి చేస్తారు.