నానబెట్టిన ఎండుద్రాక్ష తింటే ఏమవుతుందో తెలుసా..?

18 December 2023

2024లో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అధ్యక్షుడు జో బైడెన్‌తో పాటు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోటీలో ఉన్నారు.

వీరితో పాటు భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నాయకుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి ఎన్నికల బరిలో ఉన్నారు.

వచ్చేవారం కూడా మరో 38 ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలని వివేక రామస్వామి ప్రణాళిక సిద్దం చేసుకున్నారు.

ఈ మేరకు యూఎస్‌ఏ టుడే ఒక కథనం వెల్లడించింది. ప్రచారంలో రామస్వామి మిగిలిన అభ్యర్థులతో పోలిస్తే చాలా ముందున్నారు.

ప్రచారంలో అంత ఉత్సాహంగా ఎలా పాల్గొంటున్నారన్న ప్రశ్నకు స్పందించారు రామస్వామి.. తన సభలకు వస్తున్న ప్రజల నుంచే ప్రేరణ పొందుతున్నట్లు తెలిపారు.

మనం ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజలతో మమేకం కావడానికి ఇదే సరైన మార్గమని... రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిగా నా ఎన్నికపై పూర్తి విశ్వాసం ఉందని రామస్వామి వెల్లడించారు.

వివేక్ రామస్వామి అమెరికాలోని ఓహియో రాష్ట్రంలో జన్మించారు. వివేక్ రామస్వామి తల్లిదండ్రులు కేరళలోని పాలక్కడ్ జిల్లాలో జన్మించారు.

వివేక్ రామస్వామి తండ్రి వి.జి. రామస్వామి కేరళలోనే ఓ స్థానిక కాలేజీలో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తిచేసిన అనంతరం ఉద్యోగరీత్యా అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.