ప్రపంచంలో దాదాపు 195 దేశాలు వివిధ న్యాయ వ్యవస్థలను కలిగి ఉన్నాయి. ఏ దేశంలోనైనా నేరానికి తగిన శిక్ష విధిస్తారు. నేరం చేసిన వ్యక్తి శిక్షనుంచి తప్పించుకోలేడు.
ఒక వ్యక్తి చేసిన నేరానికి మూడు తరాలవారు శిక్ష అనుభవించే చట్టం ప్రస్తుతం ఉత్తర కొరియా దేశంలో అమలవుతోంది.
నియంత కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియ దేశాన్ని పాలిస్తున్నాడు. ఈ దేశం గురించి ప్రపంచవ్యాప్తంగా పలు చర్చలు జరుగుతుంటాయి.
ఇక్కడ, నేరం చేసిన వ్యక్తితో పాటు, అతని తాతలు, తల్లిదండ్రులు, పిల్లలు కూడా శిక్షించ అనుభవించాల్సిందే!
జైలు నుంచి ఖైదీలు తప్పించుకునే ఆలోచన చేయకూడదని, ఇక్కడ కఠినమైన చట్టాలు రూపొందించింది ఉత్తర కొరియా సర్కార్.
దేశద్రోహుల కోసం ప్రత్యేక జైలు నిర్మించారు. ఇక్కడ మహిళా ఖైదీలకు కూడా చాలా కఠినమైన శిక్షలు విధిస్తారు.
ఈ దేశం జైలులో ఖైదీలకు త్రాగడానికి చాలా తక్కువ నీరు, తినడానికి కొన్ని మొక్కజొన్న గింజలు మాత్రమే ఇస్తారు.
ఉత్తర కొరియా దేశంలో పెళ్లయిన ఆడవాళ్లకు తప్ప మరెవ్వరికీ నచ్చిన హెయిర్ స్టైల్ పెట్టుకునే స్వేచ్ఛ లేదు.