గతేడాది విషాదం మిగిల్చిన విపత్తులు.. భీకర యుద్ధాలు ఇవే..!
January 04, 2024
TV9 Telugu
గతేడాది ఫిబ్రవరి 6న తుర్కియేతోపాటు సిరియాలో చోటుచేసుకున్న భూకంపం రెండు దేశాల్లో దాదాపు 67వేల మందిని పొట్టనబెట్టుకుంది. లక్షల మంది తీవ్రగాయాలపాలయ్యారు
అట్లాంటిక్ మహాసముద్రంలో సుమారు 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ మినీ జలాంతర్గామి (టైటాన్ సబ్‌మెరైన్) పేలి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు
అక్టోబర్ 2022లో 44 బిలియన్ డాలర్లతో మైక్రో బ్లాగింగ్ వేదిక ‘ట్విటర్’ను కొనుగోలు చేసిన ఎలాన్ మస్క్ ‘ట్విటర్’ పేరును ‘ఎక్స్’గా మార్చాడు. జులై 2023 నుంచి ట్విటర్ లోగో స్థానంలో ‘ఎక్స్’ వచ్చింది
2023లో అవిశ్వాస తీర్మానంతో ప్రధాన మంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ ఖాన్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. తోషాఖానా అవినీతి కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. 2023లో భారత్ 142.86 కోట్లతో తొలిస్థానం, 42.57 కోట్ల జనాభాతో చైనా రెండోస్థానంలో నిలిచింది
పశ్చిమాసియాలోని హమాస్ ఉగ్రవాదులు అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడి చేసింది. హమాస్ దాడుల్లో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోగా.. గాజాలో 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు
ఆధిపత్య పోరు కోసం సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్‌ల మధ్య కొనసాగుతున్న పోరుతో సూడాన్ రక్తసిక్తంగా మారింది. సూడాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ‘ఆపరేషన్ కావేరీ’ని చేపట్టింది
కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హతమయ్యాడు. అతడి మరణానికి భారత్‌తో సంబంధముందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలపై భారత్ కూడా దీటుగా స్పందించింది
గడచిన ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు, భీకర యుద్ధాలు పలు దేశాలను వణికించాయి. ఉక్రెయిన్‌పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం రెండో ఏడాదీ కొనసాగుతోంది.