ఇల్లు శుభ్రంగా లేకుంటే జరిమానా.. వింత రూల్‌ ఎక్కడో తెలుసా?

24 November 2023

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌ పుగే కౌంటీలో ఇంటి పరిశుభ్రతను నిర్లక్ష్యం చేసిన వారికి జరిమానా విధించనున్నారు అధికారులు.

కౌంటీలో కొందరి ఇళ్లలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయట. ఇల్లంతా బూజు పట్టిన స్థితిలో అపరిశుభ్ర వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారట.

వారు భోజనం చేస్తున్న చోటులోనే కుక్కలు, దోమలు తిరుగుతున్నాయని తేల్చారు సిచువాన్‌ ప్రావిన్స్‌ అధికారులు.

సిచువాన్‌ ప్రావిన్స్‌ అధికారులు తనిఖీల కోసం వచ్చిన సమయంలో ఇంట్లో సాలె పురుగులు, ఇతరత్రా కీటకాలు, దుమ్ముధూళి ఉంది.

మొదటి సారి కావడంతో వారికీ మూడు నుంచి పది యువాన్లు జరిమానా విధించనున్నారు కౌంటీలో తనిఖీకి వచ్చిన అధికారులు.

రెండోసారి తనిఖీల్లో కూడా ఆ ఇల్లు పరిశుభ్రంగా లేకుంటే జరిమానా మొత్తాన్ని రెట్టింపు చేయనున్నారు అధికారులు.

తమ ఇళ్లను, వంట పాత్రలను శుభ్రం చేయకుంటే 1.4 డాలర్లు, భోజన సమయంలో కింద కూర్చుంటే 2.8 డాలర్లు జరిమానా విధించనున్నారు.

కౌంటీలోని ప్రజల జీనవ ప్రమాణాలు మెరుగుపరచడం కోసం నిబంధనలు రూపొందించినట్లు అధికారులు తెలిపినట్లు సౌత్ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ ఓ కథనం ప్రచురించింది.