పాకిస్తాన్‌లో ఎన్నికల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది.. కొన్ని వాస్తవాలు ఇవే!

TV9 Telugu

07 February  2024

తీవ్ర రాజకీయ, ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌‌లో సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి.

పాకిస్తాన్ పార్లమెంటరీ ప్రజాస్వామ్యం, నేషనల్ అసెంబ్లీ అని పిలువబడే ఫెడరల్ లెజిస్లేచర్‌కు ఎన్నికలు జరగనున్నాయి.

నాలుగు ప్రావిన్షియల్, లేదా స్టేట్, లెజిస్లేచర్లలో సీట్ల కోసం ఓటింగ్ జరుగుతుంది. 241 మిలియన్ల జనాభాలో 128 మిలియన్ల మంది ఓటు వేయడానికి అర్హులు.

18 ఏళ్లు పైబడిన వారందరికీ ఓటు హక్కు. పోలింగ్ బూత్‌లు సాధారణంగా ఉదయం 9 నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటాయి.

ఎన్నికల రోజున, ఓటర్లు తమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇద్దరు శాసనసభ్యులకు తమ ఓటు వేస్తారు.

ఒకరు సమాఖ్య, మరొకరు ప్రాంతీయంగా ఓటు హక్కు వినియోగించుకోనున్న పాకిస్థానీయలు. ఫెడరల్ లెజిస్లేచర్‌కు 5,121 మంది అభ్యర్థులు, ప్రావిన్సులకు 12,695 మంది అభ్యర్థులు పోటీ.

జాతీయ అసెంబ్లీలో 336 స్థానాలకు గానూ 266 పోలింగ్ రోజున ప్రత్యక్ష ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటారు. 70 రిజర్వ్‌డ్ సీట్లు. అందులో 60 మహిళలకు, 10 ముస్లిమేతరులకు కేటాయింపు.

గెలిచిన అభ్యర్థులు జాతీయ అసెంబ్లీలో సభ్యులు అవుతారు. స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల తర్వాత ఏదైనా పార్టీలో చేరే అవకాశం ఉంది.

జాతీయ అసెంబ్లీ ప్రధానమంత్రిని ఎంపిక చేయడానికి పార్లమెంటరీ ఓటింగ్ నిర్వహిస్తుంది. ప్రధాని కావాలంటే ఫెడరల్ లెజిస్లేచర్‌‌లో సాధారణ మెజారిటీ అంటే కనీసం 169 మంది సభ్యుల మద్దతు ఉండాలి.