'హైజాక్ చేయడం.. డబ్బు దోచుకోవడం' సోమాలియా పైరెట్స్ ఖాతాలో ఎన్ని నేరాలో
January 07, 2024
TV9 Telugu
సోమాలియా తీరంలో తరచూ వాణిజ్యనౌకలు హౌజాక్ అవుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలోని పైరేట్లు (సముద్ర దొంగలు) ఏడాదికి కనీసం 10- 20 నౌకలు హౌజాక్ చేస్తున్నట్లు రికార్డులు చెబుతున్నాయి
2018 ఫిబ్రవరిలో సింగపూర్ దేశానికి చెందిన ఎమ్‌టీ లెపార్డ్ అనే వాణిజ్య నౌక సోమాలియా తీరంలో ఉండగా సముద్రపు దొంగలు 2 మరపడవల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు. నౌక భద్రత సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు
2017 ఏప్రిల్ 10న తువాలు-జపాన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓఎస్ 35 అనే వాణిజ్య నౌక పోర్ట్ కెలాంగ్ నుంచి ఏడెన్ వెళ్తుండగా ముగ్గురు సముద్రపు దొంగలు దానిని హైజాక్ చేయగా భారత్, చైనా నేవీ సంయుక్తంగా షిప్‌ను రక్షించాయి
కొమోరోస్, యూఏఈ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆరిస్ 13 వాణిజ్య నౌకపై 2017 మార్చి 16న సోమాలియా తీరంలో సముద్ర దొంగలు కాల్పులకు దిగారు. అయితే సోమాలియా వ్యాపారవేత్తలే ఈ షిప్‌ను రప్పించారని తెలుసుకుని వదిలేదశారు
వాణిజ్య నౌకకు ఇంధనం సమకూర్చేందుకు వెళ్తున్న స్పెయిన్ నేవీ ట్యాంకర్‌పై జనవరి 12, 2012న సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. అయితే నేవీ ట్యాంకర్‌లో 148 మంది నావికులు చాకచక్యంగా దిడిచేసి ఆరుగురు దొంగలను పట్టుకున్నారు
అదే ఏడాది ఫిబ్రవరి 16న దుబాయ్‌లోని ఓ వ్యాపార సంస్థకు చెందిన రోల్‌ఆన్-రోల్‌ఆఫ్ వాణిజ్య నౌకను సోమాలియా పైరేట్లు హైజాక్ చేయగా.. 2,50,000 అమెరికా డాలర్లు చెల్లించిన తర్వాతే ఆ నౌకను వదిలిపెట్టారు
గ్రీస్ నుంచి ముడిచమురును తీసుకెళ్తున్న ఎమ్‌వీ స్మిర్ని అనే వాణిజ్య నౌకను 11, మే 2012న సముద్రపు దొంగలు హైజాక్ చేయగా 9,50,000 యూఎస్ డాలర్లు చెల్లించిన తర్వాతే దానిని విడిచి పెట్టారు
ఒమన్ తీరంలో ముడిచమురుతో వెళ్తున్న గ్రీస్ దేశానికి చెందిన ఎమ్‌వీ ఇర్నెసెల్ నౌక 2011, ఫిబ్రవరి 9న హైజాక్‌కు గురవ్వగా 13,50,000 అమెరికా డాలర్లు చెల్లించి నౌకను వెనక్కి తెప్పించుకున్నారు